కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంపై.. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో సూపర్ శానిటేషన్ కార్యక్రమాన్ని.. ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రారంభించారు. పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకొని పట్టణమంతా.. సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శానిటేషన్ చేశారు.
పట్టణంలో ప్రధాన రహదారులు, ప్రధాన వీధులతో పాటు కాలనీలు, మారుమూల ప్రాంతాల్లో సైతం శానిటేషన్ జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కరోనా తీవ్రంగా విజృంభిస్తుండటంతో.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరుచూ చేతులను శుభ్రంగా చేసుకోవటంతో పాటు ఎప్పటికప్పుడు ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించడం వంటి జాగ్రత్తలు పాటించాలని కోరారు.
ఇదీ చదవండి:
కొవిడ్ సోకిన ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ఇవ్వాలి: గెజిటెడ్ అధికారుల ఐకాస