ఈ సంవత్సరం ఎండలు మండిపోతున్నాయి. నిత్యం కళకళలాడే వీధులన్నీ ఉదయమే నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఆహ్లాదానికి నెలవైన పశ్చిమగోదావరి జిల్లా సైతం ఈ సారి భానుడి ప్రతాపానికి వణికి పోతోంది. తణుకు ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో ఎన్నడూ లేనివిధంగా అత్యధిక స్థాయిలో 45 నుంచి 46 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు.
" 'సూర్య' తాపానికి పల్లె నుంచి పట్టణం వరకూ అల్లాడిపోతోంది. మరో రెండు రోజులు ఉష్ణోగ్రతలు ఇలానే నమోదవుతాయనే వాతావరణ శాఖ హెచ్చరికి అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. "