పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం ఐ భీమవరం గ్రామంలో కరోనా అనుమానితుడిని చెత్త ఆటోలో తరలించటంపై.. సబ్‌కలెక్టర్ విచారణ చేపట్టారు. ఆకివీడు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన విచారణ కార్యక్రమంలో తహసీల్దార్ నుంచి గ్రామ స్థాయి అధికారులు వివరాలు సేకరించారు. అనారోగ్యంతో బాధపడే వారిని ఇలా చెత్త ఆటోలో తరలించటం సరికాదని హితవు పలికారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సబ్‌కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అధికారుల నుంచి సేకరించిన నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని విశ్వనాథన్ తెలిపారు.
ఇదీ చదవండి: దారుణం... చెత్త బండిలో కరోనా అనుమానితుడి తరలింపు