ETV Bharat / state

పోలవరం పెండింగ్‌ నిధుల విడుదలకు కేంద్రం షరతు? - కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ వార్తలు

రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన... దిల్లీలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యాక కూడా పోలవరం నిధులపై గట్టి హామీ లభించలేదని సమాచారం. 55వేల కోట్ల తొలి డీపీఆర్ కాకుండా, 20వేల కోట్లతో రెండో డీపీఆర్​ను పీపీఏ ఆమోదిస్తేనే.... ప్రాజెక్టుపై ఖర్చుపెట్టిన 2వేల 234 కోట్లయినా వస్తాయని చెప్పినట్టు తెలుస్తోంది. తాజా పరిణామాలపై ఆర్థికశాఖ, జలవనరులశాఖ అధికారులతో సీఎం జగన్‌ నేడు చర్చించనున్నారు.

Polavaram pending funds
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​కు వినతిపత్రం అందజేస్తున్న బుగ్గన
author img

By

Published : Oct 24, 2020, 6:42 AM IST

పోలవరం ప్రాజెక్టు నిధులపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నుంచి గట్టి హామీ లభించలేదని సమాచారం. రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌ దిల్లీలో శుక్రవారం కేంద్ర ఆర్థికమంత్రిని కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగు నిధులు, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులు త్వరగా ఇవ్వాలని విన్నవించారు. అయితే.. పోలవరం అథారిటీ గతంలో పంపిన సుమారు రూ.55వేల కోట్ల డీపీఆర్‌ను కాదని, కేంద్ర జలసంఘం ఇటీవల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.20,398.61 కోట్లుగా తేలుస్తూ డీపీఆర్‌-2ను ప్రతిపాదించింది. దాన్ని పోలవరం అథారిటీ ఆమోదిస్తేనే.. ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఖర్చుపెట్టిన రూ.2,234 కోట్ల బకాయిలైనా వస్తాయని నిర్మలా సీతారామన్‌ చెప్పినట్లు సమాచారం. ఆర్థికమంత్రిని కలిసి వచ్చిన తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రిని నిధులు అడిగినట్లు మాత్రమే చెప్పారు. సీఎంతో మాట్లాడాక తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేతప్ప కేంద్ర ఆర్థికమంత్రి నుంచి సానుకూల సంకేతాలు ఉన్నట్లుగా ఏమీ చెప్పలేదు.

పోలవరం తాజా పరిణామాలపై సీఎం జగన్‌ శనివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్థిక, జలవనరులశాఖ అధికారులతో సమావేశమై చర్చించనున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం చేయాలనేది ఈ భేటీలో నిర్ణయిస్తారని తెలిసింది. సీఎంవో నుంచి పోలవరం అధికారులను కొంత సమాచారం కోరడంతో పాత రికార్డులు అన్నీ సరిచూస్తూ అధికారులు నివేదికలు తయారుచేస్తున్నారు.

అథారిటీ నిర్ణయం ఏమిటి?

ప్రస్తుతం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.20,398.61 కోట్లకు ఆమోదించి పంపే అంశం పోలవరం ప్రాజెక్టు అథారిటీ వద్దకు చేరింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఈ అథారిటీని 2014లోఏర్పాటు చేసింది.

ఇప్పటివరకూ పోలవరం ప్రతిపాదనలన్నీ ఆ సంస్థ ద్వారానే కేంద్ర జలసంఘానికి, కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు, అక్కడినుంచి ఆర్థికశాఖకు చేరుతున్నాయి. నిధులు విడుదల కావాలన్నా బిల్లుల పరిశీలన కూడా అక్కడే జరుగుతోంది. ప్రస్తుతం పనులు పూర్తై పెండింగులో ఉన్న రూ.2,234 కోట్ల పోలవరం నిధులు విడుదల కావాలన్నా కేంద్ర ఆర్థికశాఖ తాజా అంచనాలను పోలవరం అథారిటీ ఆమోదించాలి.
అత్యవసర సమావేశం: పోలవరం అథారిటీ వచ్చే వారమే అత్యవసరంగా సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. సమావేశం ఎప్పుడు ఏర్పాటుచేసినా తమకు సమ్మతమేనని రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు చెప్పారు. ఈ సమావేశానికి రాష్ట్ర జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ హాజరు కానున్నారు. కేంద్ర ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శి జగ్‌మోహన్‌ గుప్తా కూడా ఈ సమావేశానికి రావాలి. ప్రస్తుత డీపీఆర్‌పై మదింపు చేసిన రివైజ్డు కాస్ట్‌ కమిటీ ఛైర్మన్‌ కూడా ఆయనే. ఆయనకు అనుకూలంగా ఉండే రోజున పోలవరం అథారిటీ సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

గతంలో పోలవరం అథారిటీ సుమారు రూ.55వేల కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ను ఆమోదించి కేంద్ర జలసంఘానికి పంపింది. కేంద్ర జలసంఘం కూడా దీన్ని మదింపు చేసి సాంకేతిక సలహా కమిటీ ముందు ఉంచింది. కేంద్ర జలసంఘమే దీన్ని సవరిస్తూ రూ.20,398.61 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ 2ను ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో 2013-14 ధరలతో డీపీఆర్‌ను ఆమోదించడంపై పోలవరం అథారిటీ ఏమంటుందో చూద్దామని ఏపీ జలవనరులశాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనేది ముఖ్యమంత్రి వద్ద సమావేశంలో నిర్ణయమవుతుందని ఏపీ అధికారులు చెబుతున్నారు. పోలవరం అథారిటీ సమావేశంలో రాష్ట్ర వైఖరిని వెల్లడిస్తామని అంటున్నారు.

పోలవరానికి మొత్తం నిధులివ్వండి: బుగ్గన

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు పరిహారం, పునరావాసానికి సంబంధించిన మొత్తం నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కేంద్రమంత్రిని శుక్రవారం ఆయన కలిశారు. గత తెదేపా ప్రభుత్వం 2014 నిర్మాణ అంచనాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకరించిందని, నిర్మాణ వ్యయం, పునరావాసం, పరిహారం, ఇతర వ్యయాలు భారీగా పెరిగినందున ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని ఆయన కేంద్రమంత్రిని కోరారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులపై రాష్ట్రం ఇప్పటివరకు వెచ్చించిన రూ.4 వేల కోట్లకు పైగా నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బుగ్గన విలేకర్లతో మాట్లాడారు. పునర్విభజనతో పూర్తిగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన ఏకైక మేలు పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడమేనన్నారు. పోలవరం ప్రాజెక్టు పునరావాసం, భూ సేకరణ, ఆయకట్టు పెంపునకు వ్యయం పెరిగే అవకాశం ఉన్నందున తామే ప్రాజెక్టును చేపడతామని 2014లో కేంద్రం ప్రకటించిందన్నారు. 2016 వరకు ప్రాజెక్టు పనులు సాగలేదని, నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం నిర్మాణంపై పలుమార్లు ప్రశ్నించినా నాటి తెదేపా ప్రభుత్వం పట్టిసీమ, ఇతర పేర్లతో పట్టించుకోలేదని విమర్శించారు. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి 2016 సెప్టెంబరులో ప్రత్యేక ప్యాకేజీ తెచ్చామని చెప్పారన్నారు. ఆ ప్యాకేజీలో భాగంగా పోలవరానికి 2014 నాటి నిర్మాణ వ్యయం ఇస్తే చాలని ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. జాతీయ ప్రాజెక్టును కేంద్రం చేపడితే తమకు కాంట్రాక్టు పనులు దక్కవనే ఉద్దేశంతో తామే నిర్మాణం చేపడతామని నాటి ప్రభుత్వం ప్రకటించిందని విమర్శించారు. ప్రాజెక్టు అంచనాలు సవరించాలంటూ 2017లో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారని, అందులో 2014లో పరిమితం చేసిన ఖర్చును కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ద్వారా త్వరగా నిర్ధారించాలని కోరారన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు అంచనాల సవరణ సందర్భంగా ఈ బండారమంతా బయట పడిందన్నారు. గత ప్రభుత్వం చేసిన అన్యాయం, అధ్వాన పరిపాలనతో రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలు, లేఖలను వదిలేసి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యను ప్రత్యేకంగా పరిగణించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరినట్లు చెప్పారు. జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర ప్రభుత్వం కూర్చుని సమస్యను పరిష్కరించాలని కోరినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సూచనలతో, సమగ్ర ప్రణాళికతో ఈ అంశంపై ముందుకు సాగుతామని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు.

ఇదీ చదవండి:

పోలవరం ఖర్చు పరిమితం చేయాలని చంద్రబాబే లేఖ రాశారు: బుగ్గన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.