పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడెం వద్ద స్పిరిట్ లారీ బోల్తా పడింది. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న స్పిరిట్ లారీ అదుపుతప్పి పడిపోయింది. స్పిరిట్ లీక్ అయి ఘాటు వాసన రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. జంగారెడ్డిగూడెం నుంచి అగ్నిమాపక శకటం రప్పించారు. స్పిరిట్ కంపెనీ నుంచి మరో వాహనం వచ్చి అందులోని ద్రావణం ఎగుమతి చేసేవరకు అగ్నిమాపక శకటం సంఘటన స్థలం వద్దే ఉంటుందని అగ్నిమాపక అధికారి శ్రీనివాసులు తెలిపారు.
దర్భగూడెం వద్ద స్పిరిట్ లారీ బోల్తా - Spirit Larry Bolta at jilugumilli mandal
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న స్పిరిట్ లారీ జీలుగుమిల్లి మండలం దర్భగూడెం వద్ద బోల్తా పడింది. స్పిరిట్ లీక్ అవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.