ETV Bharat / state

Somu: ఇళ్ల స్థలాల పేరిట రూ.5 వేల కోట్లు దోచేశారు: సోము వీర్రాజు

author img

By

Published : Feb 8, 2022, 7:03 AM IST

పేదలకు ఇళ్ల పేరిట రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు 5 వేల కోట్లు దోచేశారని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. పేదల ఇళ్లు, రేషన్ బియ్యం సహా అన్ని పథకాలకు కేంద్రం సాయం చేస్తుంటే... అంతా తమ ఘనత అన్నట్లు రాష్ట్ర సర్కార్ ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు.

ఇళ్ల స్థలాల పేరిట రూ.5 వేల కోట్లు దోచేశారు

ఇళ్ల స్థలాల పేరిట వైకాపా నేతలు రూ.5వేల కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన..కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా ఆర్థిక ఇబ్బందులతో అభివృద్ధి కుంటుపడుతోందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దీనిపై భాజపా ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేపడతామని చెప్పారు.

"భాజపా అధికారంలోకి వస్తే తక్కువ ధరకే ఇసుక అందిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్లే అభివృద్ధి, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. కాకినాడలో పెట్రో కెమికల్‌ కారిడార్‌ ఏర్పడితే ప్రత్యక్షంగా 2 లక్షల మందికి, పరోక్షంగా మరో 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు చేరువవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ఆ ప్రాజెక్టు నిలిచింది. టిడ్కో ఇళ్లను కేంద్ర ప్రభుత్వ సాయంతో పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటాం." అని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షం జనసేనతో కలిసి ముందుకెళ్తామన్నారు.

ఎంపీ రఘురామ విషయంలో ఏదైనా జరగొచ్చు
నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు వైకాపాకు రాజీనామా చేసి భాజపాలో చేరి పోటీ చేసే అవకాశం ఉందా ? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆయన విషయంలో ఏదైనా జరగవచ్చని సోము వీర్రాజు పేర్కొన్నారు. భాజపా పెద్దలతో ఆయన టచ్‌లో ఉన్నారని చెప్పారు. పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ పాకా వెంకటసత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

Statue of Equality: సమతామూర్తి.. భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి : సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.