పశ్చిమగోదావరి జిల్లా టి.నర్సాపురంలోని మెడంకి సర్వేశ్వరావు అనే వ్యక్తి ఇంట్లో మంచంపై ఉంచిన ఖాళీ వాటర్ బాటిల్లోకి నల్లత్రాచు పాము(SNAKE IN BOTTLE) చేరింది. అది గమనించని అతని భార్య వాటర్ బాటిల్‌ని పట్టుకుంది. బాటిల్లో ఉన్న పాము ఒక్కసారిగా బయటకు రావడంతో ఆమె కేకలు వేసి బాటిల్‌ను విసిరేసింది. అయినా పాము బాటిల్లోనే ఉండిపోయింది. ఆమె కేకలు విని అక్కడకు చేరుకున్న చుట్టుపక్కల వారు ఆ వాటర్ బాటిల్ మూతపెట్టి బయటకు తీసుకెళ్లారు. ఎవరూ లేని ప్రదేశంలో దానిని కర్రలతో కొట్టి చంపారు. తృటిలో ప్రాణాపాయం తప్పడంతో ఆ కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి:
Polavaram Compensation: ఎకరాకు రూ.19 లక్షల హామీ ఏమైంది?: లోకేశ్