ETV Bharat / state

సింహాద్రి స్కెచ్‌ వేస్తే ఉచ్చులో పడాల్సిందే... - సైనేడ్ కిల్లర్ సింహాద్రి పశ్చిమగోదావరి జిల్లా

అతనొక సాధారణ కాపలాదారు. అయితేనేం.. 'చావు' తెలివితేటలకు ఏమాత్రం కొదవలేదు. అత్యంత చాకచక్యంగా, నెత్తురు చుక్క నేలరాలకుండా హత్యాకాండ సాగించాడు. డబ్బు మీద ఆశతో మోసాలు చేస్తూ.. పదుల సంఖ్యలో హత్యలు చేశాడు. పూజలు, గుప్తనిధుల పేరుతో ప్రజలను నమ్మించి సైనెడ్​తో చంపి.. డబ్బు, బంగారం దోచుకున్నాడు. మూడు జిల్లాల్లో 20 నెలల్లో 10  మందిని హతమార్చాడు.

సైనేడ్ కిల్లర్ సింహాద్రి
author img

By

Published : Nov 6, 2019, 7:16 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు గ్రామీణ మండలం వెంకటాపురం పంచాయతీ ఎన్టీఆర్ కాలనీకి చెందిన వెల్లంకి సింహాద్రి అలియాస్ శివ. డబ్బు, బంగారం కోసం సైనేడ్​తో హత్యలకు పాల్పడ్డాడు. 20 నెలల కాలంలో 10 మందిని చంపేశాడు. సింహాద్రి మాములు కాపలాదారు. దాన్ని వదిలేసి స్థిరాస్తి వ్యాపారం ప్రారంభించాడు. అందులో ఆదాయం రాక తప్పుదారి పట్టాడు. అడ్డదారి ఎంచుకుని మోసాలకు పాల్పడుతూ.. హత్యలు చేసి డబ్బు, బంగారం దోచుకున్నాడు. ఇప్పటి వరకూ 10 మందిని హతమార్చి దాదాపు 29 లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు, నగదు దొంగిలించాడు.
హత్యాకాండ సాగిందిలా
ప్రజల బలహీనతే సింహాద్రి ఆయుధాలు. ముందుగా అలాంటి వారిని ఎంచుకుని నమ్మిస్తాడు. చెప్పిన పూజలు చేస్తే బంగారం రెట్టింపు అవుతుందని చెబుతాడు. తర్వాత వారి ఇంట్లో చేరి చాకచక్యంగా సైనెడ్ ఇచ్చి చంపేసి.. బంగారం, నగదుతో ఉడాయిస్తాడు. అలా దోచుకున్న డబ్బుతోనే ఏలూరులో ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పటి వరకూ 10 మందిని చంపినా ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. కొన్నైతే పోలీస్ స్టేషన్​లోనూ నమోదు కాలేదంటే ఎంత పకడ్బందీగా హత్యలు చేశాడో అర్థమవుతుంది.
హత్యకు గురైనవారు
సింహాద్రి చేతిలో మోసపోయి.. హత్యకు గురైనవారిలో పలువురు ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారు. కృష్ణాజిల్లా నూజువీడుకు చెందిన వల్లభనేని ఉమామహేశ్వరరావు హత్యతో ప్రారంభమైంది ఇతని నేరచరిత్ర. కుటుంబసభ్యులు అది సహజమరణం అనుకుని పోలీసు కేసు పెట్టలేదు.
బంధువైనా స్నేహితుడైనా సింహాద్రికి ఒక్కటే...
కృష్ణాజిల్లాకు చెందిన తవిటయ్య, బాల వెంకటటేశ్వరరావును హతమార్చి సొత్తు దోచుకొన్నాడు. పశ్చిమగోదావరిజిల్లాకు చెందిన సూర్యనారాయణ, రాములమ్మ, నాగరాజు.. తూర్పుగోదావరికి చెందిన రామకృష్ణానందస్వామిజీ, కొత్తపల్లి రాఘవమ్మ, సమంతకుర్తి నాగమణిని హత్యచేసి దోపిడి చేశాడు. సొంత బంధువులు, స్నేహితులు, తన అద్దెకు ఉంటున్న ఇంటి యజమానురాలినీ వదల్లేదు. రాజమహేంద్రవరానికి చెందిన తన బామ్మ కొత్తపల్లి రాఘవమ్మ, వదిన సమంతకుర్తి నాగమణిని చంపి బంగారం, నగదు దోచుకెళ్లాడు. స్నేహితుడైన గడికోట వెంకటభాస్కరరావునూ హత్య చేశాడు.
ఉపాధ్యాయుడి హత్యతో చిక్కాడిలా
గత నెల ఏలూరులో నాగరాజు అనే ఉపాధ్యాయుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ముందు గుండెపోటుగా భావించిన కుటుంబ సభ్యులు... అతని వద్ద ఉన్న బంగారు చైను, డబ్బు లేకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదుచేశారు. నాగరాజు కాల్​డేటా ఆధారంగా విచారణ చేసిన పోలీసులకు సింహాద్రి గుట్టు తెలిసింది. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే అసలు విషయాలు వెల్లడయ్యాయి. తానే నాగరాజుని హతమార్చినట్లు వెల్లడించాడు.
సైనేడ్‌ అతని ఆయుధం
డబ్బు సంపాదన మీద ఉన్న పేరాశతో విజయవాడలోని షేక్ అమీనుల్లా అనే వ్యక్తి నుంచి సైనేడ్ సంపాదించాడు. దీని సాయంతో హత్యలు చేశాడు. గుప్తనిధులు, రైస్ పుల్లింగ్ కాయిన్ వంటి మోసాలకు పాల్పడి.. వరుస హత్యలు చేశాడు. ఇతనితోపాటు.. సైనేడ్ సరఫరా చేసిన విజయవాడకు చెందిన షేక్ అమానుల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి..

ఒకటి తప్పింది.. మరొకటి బలి తీసుకుంది!

Intro:AP_TPG_03_06_SERIAL_KILLR_CLUESE_MURDER_PKG_3067983_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
నోట్.. దీనికి సంబంధించిన ఫాలోఅప్ స్టోరీ స్క్రిప్ట్ ఈటీవీ స్టాఫ్ రిపోర్టర్ rayudugaru ఎఫ్.టి.పి లో పంపిస్తున్నారు పరిశీలించగలరు.
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
(  )

Body:a

Conclusion:a
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.