ETV Bharat / state

తీరని సర్వర్​ సమస్యలు.. రేషన దుకాణాల వద్ద జనం బారులు - server problems in ration distribtion in west godavari

కరోనా వైరస్ ప్రభావంతో లాక్​డౌన్ అమలు కారణంగా ప్రభుత్వం ప్రకటించిన రెండో విడత ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రహసనంగా మారింది. పశ్చిమగోదావరి జిల్లాలో వివిధ చోట్ల సర్వర్ మొరాయించడం వల్ల పంపిణీలో ఇబ్బందులు తలెత్తాయి. దుకాణాల వద్ద వినియోగదారులు అధిక సంఖ్యలో బారులు తీరారు.

తీరని సర్వర్​ సమస్యలు.. రేషన దుకాణాల వద్ద జనం బారులు

author img

By

Published : Apr 16, 2020, 12:34 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో రెండో విడత రేషన్​ పంపిణీకి సర్వర్​ సమస్యలు అడ్డంకిగా మారాయి. జిల్లాలో సుమారు 12 లక్షల ఇరవై ఎనిమిది వేల రేషన్ కార్డులున్నాయి. అధికారులు ఇవాళ్టి నుంచి రెండో విడత పంపిణీని ప్రారంభించారు. అయితే ఈసారి తగినంత కందిపప్పు నిల్వలు లేకపోవడం వల్ల ఒక్కో కార్డుదారునికి బియ్యంతోపాటు కిలో శెనగలు అందజేశారు. మొదటిసారి పంపిణీలో వినియోగదారులు పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కూపన్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. పట్టణాల్లో వార్డు సిబ్బంది, గ్రామాల్లో గ్రామ వాలంటీర్లు తమ పరిధిలో కార్డుదారులకు రేషన్​ పొందే తేదీని కూపన్ల​పై వేసి ఇచ్చారు. నిర్దేశిత తేదీ ప్రకారం లబ్ధిదారులు రేషన్​ పొందేలా ఏర్పాటు చేశారు.

వీడని సర్వర్​ కష్టాలు..

జిల్లాలోని కొన్నిచోట్ల రేషన్​ పంపిణీలో సర్వర్​ సమస్యలు తలెత్తాయి. దీని వల్ల పంపిణీ నిలిచిపోయింది. తణుకు, ఉండ్రాజవరంలోని రేషన్​ దుకాణాల వద్ద లబ్ధిదారులు అధిక సంఖ్యలో బారులు తీరారు. అయితే లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి..

వేమవరంలో పేదలకు ఆహారం పంపిణీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.