పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రెండో విడత వ్యాక్సిన్ కార్యక్రమాన్ని అధికారులు ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు. గతంలో టీకా వేసుకోవాలంటే అనేకమంది భయాందోళనకు గురవ్వడంతో పాటు కొంత ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం టీకా తీసుకునేవారికి ఇక్కట్లు లేకుండా ప్రణాళికాబద్ధంగా జిల్లాలో రెండో విడత కార్యక్రమాన్ని అమలుచేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా 23 వేల కొవిషీల్డ్ టీకాలను.. 123 పట్టణ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోని ప్రజలకు వ్యాక్సినేషన్ ద్యారా అందిస్తున్నారు. ముందుగా టీకా వేసుకునే వారికి ఎప్పుడు..? ఎక్కడ..? వాటిని అందిస్తారో సమాచారాన్ని ముందుగానే అందిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా గాలి, వెలుతురు వచ్చే ప్రాంతాల్లో షామియానాలు ఏర్పాటు చేసి.. అక్కడ కుర్చీలు, తాగునీరును అందుబాటులో ఉంచుతున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతోంది. పోలీసులు, అధికారులు ఈ వీటిని పర్యవేక్షిస్తున్నారు.
ఇవీ చదవండి: