పశ్చిమగోదావరి జిల్లా ప్రభుత్వ పాఠశాల స్వీపర్లు ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. జిల్లాలో 3వేల మందికి 14నెలలుగా వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 11కోట్ల రూపాయల వేతన బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పుడు పట్టించుకోవడంలేదంటూ వాపోయారు. తక్షణమే వేతనాలు విడుదల చేసి సమస్యలు పరిష్కరించాలని స్వీపర్లు కోరారు.
ఇదీ చూడండి: గ్రావెల్ తవ్వకాన్ని అడ్డుకున్న ఉంగుటూరు గ్రామస్థులు