రవాణాశాఖ ఆధ్వర్యంలో స్కూల్ బస్ డ్రైవర్లుకు అవగాహన, ఆరోగ్యపరీక్షలు నిర్వహించటం అభినందనీయమని పశ్చిమగోదావరిజిల్లా తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. శశి కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును ఆయన ప్రారంభించారు. వాహనచోదకులు 6 నెలలకొకసారి వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం డ్రైవర్లందరికీ ఆరోగ్యకార్డును ఇస్తోందని.. వెయ్యిరూపాయల కంటే ఎక్కువగా ఖర్చయ్యే వైద్యాన్ని ఉచితంగా పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను.. ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
ఇది కూడా చదవండి.