ETV Bharat / state

రైళ్లలో రిగ్రెట్... బస్సుల్లో బాదుడు... ఇంటికెళా వెళ్లేది..! - latest news on sankranthi

సంక్రాంతి... రాష్ట్రంలో అందరూ ఎంతో ఆనందంగా జరుపుకునే పండగ. ఆ ఆనందం సంగతి దేవుడెరుగు... ఇతర నగరాలు, పట్టణాల్లో ఉంటున్నవారు ఇప్పుడు సొంతూళ్లకు వెళ్లడమే పెద్ద సవాల్​గా మారింది. బస్సులు, రైళ్లు, విమానాలు ఇలా అన్నింట్లో ప్రయాణం భారంగా మారింది. పోనీ డబ్బులు పోయినా ఫర్వాలేదు... వెళ్దాం అనుకున్నా సీట్లు దొరకవు. ప్రస్తుతం ఇదీ పరిస్థితి.

sankranthi rush.. booking were full
సంక్రాంతి రద్దీ
author img

By

Published : Jan 9, 2020, 3:24 PM IST

సంక్రాంతి రద్దీ

సంక్రాంతి రద్దీ.. ప్రయాణసాధనాలను కిటకిటలాడిస్తోంది. విశాఖ వైపు వచ్చే అన్ని రైళ్లలో రిజర్వేషన్లు 3 నెలల ముందుగానే భర్తీ అయ్యాయి. గోదావరి ఎక్స్​ప్రెస్ లాంటి రైళ్లకు స్లీపర్ క్లాస్​లో 600 వరకు వెయిట్ లిస్ట్​తో... రిగ్రెట్ వెయిట్​లిస్ట్ సమాచారం దర్శనమిస్తోంది. ఇక హైదరాబాద్​కు తిరుగు ప్రయాణంలో 19వ తేదీ ఆదివారం నాటికి విమానం టిక్కెట్టు ధర ఇప్పుటికే రూ.18 వేలకు చేరుకుంది. బస్సుల టిక్కెట్ల ధరలూ 3 నుంచి 4 వేలకు చేరుకున్నాయి.

సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లాలన్న వారికి ప్రయాణసాధనాలన్నీ కిక్కిరిసి కన్పిస్తున్నాయి. రిజర్వేషన్ల పట్టికలన్నీ ఇప్పటికే రిగ్రెట్ వెయిట్​లిస్ట్​కి చేరుకున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఉత్తరాంధ్ర వైపు వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చే గోదావరి, విశాఖ, ఫలక్​నుమా వంటి ప్రధాన రైళ్లలో కనీసం వెయిటింగ్ ​లిస్ట్​లోనూ అవకాశమే లేదు. ఉన్నత శ్రేణి... దురంతో ఎక్స్​ప్రెస్​లోనూ వెయిటింగ్ లిస్ట్ 300 దాటి ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వాయుమార్గం ప్రయాణం కూడా అందని ద్రాక్షలా మారుతోంది. సంక్రాంతి పండగ ముగిసి... తిరుగుప్రయాణంలో 19వ తేదీ నాటికి విశాఖ-హైదరాబాద్ విమాన టిక్కెట్టు ధర ఇప్పటికే రూ.18 వేలు చూపుతోంది. డైనమిక్ ప్రైసింగ్ వల్ల ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు వెళ్లే మార్గాల్లో ఈ పెరుగుదల కన్పిస్తోంది. దూర ప్రాంత బస్సుల టిక్కెట్ల ధరలూ అన్​లైన్​లో 3 నుంచి 4 వేల రూపాయలు చూపిస్తున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ఈ ధరలు రెట్టింపు కంటె ఎక్కువే. సంక్రాంతి ప్రయాణ రద్దీ శుక్రవారం రాత్రి నుంచే అరంభం కానుంది. శని, ఆదివారాల్లో పెరగనుంది.

ఇదీ చదవండి

పండుగ సీజన్... పెరిగిన ప్లాట్​ఫాం టికెట్ల ధరలు

Intro:Body:

visabgkha

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.