ETV Bharat / state

పశ్చిమగోదావరిలో రూ.20 లక్షల విలువైన మద్యం స్వాధీనం

అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నా మద్యం మాఫియా ఆగడాలు ఆగటం లేదు. తెలంగాణ, కర్ణాటక నుంచి రాష్ట్రానికి మద్యాన్ని తరలిస్తున్నారు అక్రమార్కులు. తాజాగా సుమారు 20 లక్షల రూపాయల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు.

Rs 20 lakh worth Liquor seized in West Godavari

author img

By

Published : Jul 23, 2020, 11:14 AM IST

రూ.20 లక్షల విలువైన మద్యం స్వాధీనం

తెలంగాణ నుంచి రాష్ట్రానికి తరలిస్తోన్న భారీగా మద్యాన్ని స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో(ఎస్​ఈబీ) అధికారులు పట్టుకున్నారు. సరిహద్దు ప్రాంతమైన పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి చెక్​పోస్టు వద్ద మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం విలువ సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు ప్రాథమిక అంచనా.

మొత్తం 4300 మద్యం బాటిళ్లను ఎస్​ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసిన అధికారులు.. డ్రైవర్​ను అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెంకు చెందిన మద్యం మాఫియా ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

ఇదీ చదవండి

వైకాపా రాజ్యసభ సభ్యుల్లో 50% మందిపై తీవ్రమైన కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.