Money seized in private bus: పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా వద్ద డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో విజయనగరం నుంచి గుంటూరు వెళ్తున్న పద్మావతి ట్రావెల్స్ కు చెందిన బస్సులో 4 కోట్ల 75 లక్షల రూపాయల నగదుతోపాటు 350 గ్రాముల బంగారం తరలిస్తుండగా పట్టుకున్నారు. బస్సు డ్రైవర్, క్లీనర్లును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పట్టుబడిన డబ్బు, బంగారం గురించి ప్రశ్నించారు. వారిద్దరూ మరో నలుగురి పేర్లు వెల్లడించడంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డబ్బు, నగలు ఒక నగల దుకాణం యజమానివిగా ప్రాథమిక విచారణలో తెలిందని.. వాటికి సంబంధించిన బిల్లులు, పత్రాలను చూపిస్తానని సదరు యజమాని చెప్పినట్లు సమాచారం.
ఇదీ చదవండి:
Accident: శిరివెళ్ల-రుద్రవరం రహదారిలో ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి