రాష్ట్రంలో వేర్వురు చోట్ల జరిగిన మూడు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. మరో 40 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా:
పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం కురెళ్లగూడెం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
అదుపు తప్పి...
తాడేపల్లిగూడెం పట్టణ భాజపా అధ్యక్షుడు ముప్పిడి సురేశ్ రెడ్డి తన కుమారుడిని విమానం ఎక్కించేందుకు కారులో గన్నవరం బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు కురెళ్లగూడెం వద్దకు వచ్చేసరికి టైర్ పంచర్ కావడంతో అదుపుతప్పి తాడేపల్లిగూడెం వైపు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందిగా.. డ్రైవర్ను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. మృతులను ఐనవల్లి వాసులుగా గుర్తించారు. సురేశ్ రెడ్డి ,అతని కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు.
విశాఖపట్నం జిల్లా:
విశాఖ నగర ఆర్టీసీ కాంప్లెక్స్ అండర్ పాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైలు రోడ్డు వైపు నుంచి మద్దిలపాలెం వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని... ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న రమేశ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా... వాహనం నడుపుతున్న రిటైర్డ్ ఏఎస్ఐ రామారావుకు తీవ్ర గాయాలయ్యాయి.
తూర్పుగోదావరి జిల్లా:
మారేడుమిల్లీ- చింతూరు ఘాట్ రహదారిలో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. రాజమహేెంద్రవరం నుంచి చింతూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులు రంపచోడవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి