పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారు జామున లారీని వెనక నుంచి వచ్చి ప్రైవేటు బస్సు ఢీకొంది. ఈ ఘటనలో సహాయక డ్రైవర్ మృతి చెందగా.. 8 మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరిని తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒడిశా నుంచి బెంగళూరుకు వలస కూలీలతో ఈ ప్రైవేటు బస్సు వెలుతుండగా ప్రమాదం నెలకొంది.
ఇదీ చదవండి: ఏపీలో ఉపసంఘం, సిట్ చర్యల నిలిపివేత