పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం కొత్తపండువారి గూడెం వద్ద తల్లాడ - దేవరపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం మంచు ప్రభావంతో రెండు లారీలు ఢీకొన్న ఘటనలో చోదకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తున్న లారీ, హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తున్న మరో లారీ ఢీకొన్నాయి. విపరీతంగా కురుస్తున్న మంచుతో ఎదురుగా వస్తున్న వాహనం కనిపించకపోవటంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 9 గంటల వరకు మంచు కమ్మేయటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఇదీ చదవండి : కోళ్ల దొంగలని అనుమానం... చెట్టుకు కట్టి కొట్టిన వైనం!