ఫైర్ విత్ బ్లేడ్ బార్స్ లింబో స్కేటింగ్ లో పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన ఏడేళ్ల చిన్నారి ప్రతిభ కనబరిచి మూడు రికార్డులను సొంతం చేసుకుంది. పట్టణానికి చెందిన సాత్విక గత కొంత కాలంగా లింబో స్కేటింగ్ లో శిక్షణ పొందుతోంది. 26 మీటర్ల పొడవున ఎల్ షేప్ లో ఏర్పాటుచేసిన 8 అంగుళాల ఎత్తులో కాలుతున్న బ్లేడ్ బార్ ల కింద నుంచి సాత్విక స్కేటింగ్ చేసింది. సాత్విక స్కేటింగ్ ప్రతిభను వజ్ర గోల్డ్ రికార్డ్, వరల్డ్ రికార్డ్ కిడ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులు నమోదు చేశారు.
గతంలో రికార్డులను సాత్విక అధిగమించడంతో కొత్త రికార్డులు నెలకొల్పినట్టుగా ప్రకటించి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు చేతుల మీదుగా ధ్రువ పత్రాలు, షీల్డులు అందజేశారు. రికార్డులు నెలకొల్పిన సాత్వికను మంత్రి శ్రీరంగనాథరాజు అభినందించారు.
ఇదీ చదవండి: