కరోనా కష్టాల నుంచి గట్టెక్కని పేద బడుగు వర్గాలపై రేషన్ కందిపప్పు ధర పెంపుతో మరింత భారం పడనుంది. చౌక ధరల దుకాణాల ద్వారా కార్డుదారులకు సరఫరా చేసే కందిపప్పు ధర వచ్చే నెల నుంచి రూ. 27లు పెరిగింది. పెరిగిన ధరతో పశ్చిమగోదావరి జిల్లాలో కార్డుదారులపై రూ. 3 కోట్ల 51లక్ష రూపాయల మేర భారం పడనుంది.
తాజా లెక్కల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లాలో 13 లక్షల 333 మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. లాక్ డౌన్‌కు ముందు కిలో కందిపప్పు రూ. 40లకు సరఫరా చేసేవారు. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత ప్రభుత్వం గడిచిన 8 నెలలుగా ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తోంది. ఉచిత పంపిణీ ప్రకటన కాలం ముగిసినందున వచ్చే నెల నుంచి కార్డుదారులు డబ్బులు చెల్లించే రేషన్ తీసుకోవాలి. ఇక నుంచి బియ్యానికి కిలో ఒక్క రూపాయి వంతున, కిలో కందిపప్పుకి రూ. 67లు, అరకిలో పంచదారకి రూ. 17లు చెల్లించాలి. ఏఏవై కార్డుదారులకు కిలో పంచదార 13.50 రూపాయలకు ఇస్తున్నారు.
ఇవీ చదవండి..