ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలంటూ రేషన్​ డీలర్ల నిరసన

ఉండ్రాజవరం మండల పరిధిలో ఉన్న రేషన్​ డీలర్లు స్థానిక తహసీల్దార్​ కార్యలయం వద్ద ఆందోళన చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు.

ration dealers protest at undrajavaram tahsildar office
తహసీల్దార్​ కార్యలయం వద్ద నిరసన తెలిపిన రేషన్​ డీలర్లు
author img

By

Published : Oct 22, 2020, 4:15 PM IST

ఉండ్రాజవరం మండల పరిధిలోని రేషన్​ డీలర్లు తహసీల్దార్​ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. రేషన్​ పంపిణీ, దుకాణాల నిర్వహణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలంటూ రేషన్​ డీలర్ల సంఘం జిల్లా నాయకుడు రంగ పేర్కొన్నారు.

సర్వర్​ మొరాయింపులు, రెండు సార్లు వేలిముద్రలు వేయించాల్సి ఉన్నందున సమయం వృథా అవుతుందని తెలిపారు. తమకు రావాల్సిన పది విడతల కమీషషన్​ ఇప్పించాలని, గోనె సంచుల బకాయిలను ఇవ్వాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్​ కనకరాజుకు వినతిపత్రం సమర్పించారు.

ఇదీ చదవండి :

అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు..పట్టుకున్న ఎస్ఐ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.