పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆధ్వర్యంలో తెదేపా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. నరసాపురం కాకుండా భీమవరాన్ని జిల్లా కేంద్రంగా చేస్తే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని మాధవనాయుడు అన్నారు. తీర ప్రాంత అభివృద్ధి ఈ జిల్లా కేంద్రంతోనే సాధ్యం అవుతుందని ఆయన అన్నారు. ప్రదర్శన అనంతరం సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు.
ఇదీ చదవండి: 'ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోయింది'