పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సుమారు 500 మంది విద్యార్థులతో మాంటిస్సోరి పాఠశాల యాజమాన్యం రాఖీ ఆకారంలో ప్రదర్శన చేసింది. రెండు చక్రాల మధ్య స్వస్తిక్ గుర్తు... ఆ రెండు చక్రాలు రెండు వైపులా చేతికి కట్టే తాడులా... విద్యార్థులను నిలబెట్టి రాఖీకి పరిపూర్ణత చేకూర్చారు. అనంతరం పాఠశాలలో సామూహిక రక్షాబంధన వేడుకలు నిర్వహించారు. ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు రాఖీలు కట్టి.. మిఠాయిలు పంచుకున్నారు. హిందూ సంస్కృతిలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ఎంతో ప్రత్యేకత ఉందని.. అటువంటి బంధాన్ని తెలియజెప్పేందుకే పండగ నిర్వహించామని పాఠశాల యాజమాన్యం తెలిపింది.
ఇది కూడా చదవండి