ETV Bharat / state

రైల్వే ఉద్యోగి దారుణ హత్య - పశ్చిమగోదావరి జిల్లా తాజా సమాచారం

పశ్చిమగోదావరి జిల్లా ప్రత్తిపాడులో ప్రైవేటు ఇంజినీరింగ్​ కళాశాల సమీపంలోని రైల్వే ట్రాక్​ వద్ద రైల్వే ఉద్యోగిని దుండగులు దారుణంగా హతమార్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైల్వే ఉద్యోగిని హతమార్చిన గుర్తు తెలియని వ్యక్తులు
రైల్వే ఉద్యోగిని హతమార్చిన గుర్తు తెలియని వ్యక్తులు
author img

By

Published : Dec 2, 2019, 5:22 PM IST

రైల్వే ఉద్యోగిని హతమార్చిన దుండగులు

పశ్చిమగోదావరి జిల్లా ప్రత్తిపాడులోని ప్రైవేటు ఇంజనీరింగ్​ కళాశాల సమీపంలోని రైల్వేట్రాక్​ వద్ద ఓ రైల్వే ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు బిహార్​కు చెందిన సుజిత్​ కుమార్గా పోలీసులు గుర్తించారు. ఇతను రైల్వే టెలికాం శాఖలో పనిచేస్తున్నట్లు తెలిపారు. కళాశాల వెనుక గేట్​ క్యాబిన్​లో ఫోన్​ రిపేరు నిమిత్తం వెళ్లినట్లు తోటి ఉద్యోగులు చెబుతున్నారు. ఉదయం 6 గంటల సమయంలో సుజిత్​ కుమార్ మృతదేహాన్ని చూసిన స్థానికులు పెంటపాడు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రాజేశ్వరరావు పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కడపలో వ్యక్తి దారుణ హత్య... యూపీ యువకులపై అనుమానం!

Intro:..Body:పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో దారుణం చోటుచేసుకుంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని పెంటపాడు మండలం ప్రత్తిపాడు వద్ద గల ఆకుల గోపయ్య ఇంజనీరింగ్ కళాశాలకు రైల్వే ట్రాక్ కు మధ్య ఒక వ్యక్తి దారుణ హత్యకు గురి అయ్యి విగత జీవిగా పడిఉన్నాడు. మృతుడు రైల్వే టెలికాం డిపార్ట్మెంట్ ఉద్యోగి అయిన బీహార్ కు చెందిన సుజిత్ కుమార్ గా పోలీసులు గుర్తించాయారు. ఘటనా స్థలంలో AP37 BS 0869 నెంబరు గల ద్విచక్ర వాహనం పడి ఉంది. పోలీసులు ఇచ్చిన వివరాల మేరకు బీహార్ కు చెందిన సుజిత్ కుమార్ తాడేపల్లిగూడెంలో నివాసం వుంటూ రైల్వే టెలికాం డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నాడు. రాత్రి 1.00 2.00 గంటల మధ్య కాలేజి వెనుక గేట్ no. LC375 క్యాబిన్ లో ఫోన్ రిపేరు నిమిత్తం డ్యూటీ కి వెళ్లినట్లుగా చెపుతున్నారు. అయితే ఉదయం 6 గంటల సమయంలో చనిపోయి ఉన్న సుజిత్ కుమార్ను స్థానికులు చూసి పెంటపాడు పోలీసులకు సమాచారం అందించారు. అతని యొక్క ద్విచక్ర వాహనం స్పార్క్ ప్లగ్ తీసేసి ఉండటం, మృతుని పాంట్ విప్పేసి దానిని మోకాళ్ళకు పాదాలకు మధ్య కట్టేసి, మొహం పై బలంగా కొట్టి చంపేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో కీలక అంశాలు తెలిసినట్లుగా పోలీసులు వెల్లడించారు. కొవ్వూరు డీఎస్పీ రాజేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు డాగ్స్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా సి. ఐ రవి కుమార్ తెలిపారు.

బైట్: రవి కుమార్ (పెంటపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ )Conclusion:..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.