ETV Bharat / state

విజిలెన్స్​ అధికారుల దాడులు... షాపులపై కేసులు - yeluru latest news

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలోని దుకాణాలపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. కల్తీ, ఫుడ్​ లైసెన్స్​లు లేకుండా విక్రయిస్తున్న వారి వ్యవహారాలు గుర్తించి.. కేసులు నమోదు చేశారు.

raids by vigilance officials
దాడులు నిర్వహిస్తున్న విజిలెన్స్​ అధికారులు
author img

By

Published : May 10, 2021, 8:42 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని దుకాణాలపై దాడులు నిర్వహించినట్లు విజిలెన్స్​ అధికారులు తెలిపారు. నగరంలోని మెయిన్ బజార్, మార్కెట్లో ఉన్న షాపుల్లో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ దాడుల్లో కల్తీల గురించి తెలుసుకునేందుకు శాంపిల్స్​ సేకరించామని పేర్కొన్నారు. కొందరు దుకాణాదారులు ఫుడ్ లైసెన్స్ లేకుండానే విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు.

వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలు జరిపినా.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని షాపు యజమానులను హెచ్చరించామని విజిలెన్స్​ తహసీల్దార్​ పి.రవికుమార్​ తెలిపారు. ఈ తనిఖీల్లో అగ్రికల్చర్​ ఏవోఎం శ్రీనివాస్ కుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ అక్కయ్య, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎస్. రవీంద్ర రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

నేడు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్ల నిరసన దీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.