పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో టిడ్కో ఇళ్ల పట్టాల పంపిణీలో ఘర్షణ వాతావరణం నెలకొంది. కార్యక్రమానికి హాజరైన ప్రముఖుల ప్రోటోకాల్ వివాదంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాట్లాడే అవకాశాన్ని ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు.. ముఖ్యఅతిథైన తితిదే చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు.. ఎమ్మెల్సీని వెనక్కు నెట్టారు. దీంతో కోపోద్రిక్తులైన అంగర రామ్మోహనరావు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సభను బహిష్కరించి.. వేదిక మీద నుంచి దిగిపోయారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను పోలీసులు బయటకు నెట్టుకుంటూ వెళ్తుండగా ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు కింద పడిపోయారు. ఎమ్మెల్సీకి జరిగిన అవమానంపై తెదేపా నాయకులు నినాదాలు చేశారు. దీంతో పోలీసులకు, తెదేపా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.
ఇదీ చదవండి: పూళ్లలో అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించిన ఆరోగ్య శాఖ మంత్రి