తెగుళ్లు సోకిన పంట మొక్కలతో రైతుల ధర్నా - తెగుళ్లు సోకిన పంట మొక్కలతో ఏలూరు రైతుల ధర్నా
తెగుళ్లు సోకిన పెసర, మినుము మొక్కలతో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
తెగుళ్లు సోకిన పంట మొక్కలతో ధర్నా చేస్తున్న రైతులు
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. తెగుళ్లు సోకిన పెసర, మినుము మొక్కలను చేతబట్టి వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ... కృష్ణా డెల్టా రైతులు సాగుచేసిన పెసర ,మినుము పంటల్లో తెగుళ్ల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించాలని... తెగుళ్లు సోకిన అపరాల పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.