ETV Bharat / state

లాక్ డౌన్​ ఎఫెక్ట్​: పొగాకు పంటకు కొవిడ్ పోటు - coronavirus news in andhrapradesh

లాక్ డౌన్​తో వ్యవసాయ ఉత్పత్తులు అన్నీ పంటలకే పరిమితమయ్యాయి. ముఖ్యంగా పొగాకు రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. కూలీలకు సైతం డబ్బులు చెల్లించలేని స్థితిలో ఎన్ఎల్ఎస్ (ఉత్తర ప్రాంత తేలిక నేలలు) ప్రాంత పొగాకు రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. మరోపక్క పనులు లేక పొగాకు పనులకు వచ్చిన ఇతర జిల్లాల కూలీలు తమ సొంత జిల్లాలకు వెళ్ళలేక ఆపసోపాలు పడుతున్నారు.

problems for tobacco farmers
problems for tobacco farmers
author img

By

Published : Apr 19, 2020, 10:59 AM IST

పశ్చిమ గోదావరి జిల్లాలోని పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతికి వచ్చిన పంట విక్రయించుకునే పరిస్థితి లేక రైతులు విలవిలలాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 14 వేల మంది రైతులు 22వేల హెక్టార్లలో పొగాకును ఏటా సాగు చేస్తున్నారు. నాలుగేళ్లుగా సాగులో వరుస నష్టాలు చూస్తున్నా... నెట్టుకొస్తున్నారు. గత నెల మార్చి 21న పొగాకు కొనుగోళ్లను లాంఛనంగా ప్రారంభించినా...23నుంచి లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన కారణంగా.. ప్రక్రియ నిలిచిపోయింది.

పొగాకు సాగుకు బ్యాంకుల నుంచి రుణం పొందిన రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పంట ఇంటికే పరిమితం అవుతున్న పరిస్థితుల్లో... ప్రస్తుతం బ్యాంకుల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతున్నట్లు రైతులు చెబుతున్నారు. జిల్లాలో జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి మండలాల్లో పొగాకు వేలం కేంద్రాలున్నాయి. కేవలం ప్రారంభం రోజునే కొనుగోళ్లు జరిగాయి. నాటి నుంచి నేటి వరకు ఎటువంటి క్రయవిక్రయాలు లేవు. ఇతర జిల్లాల నుంచి తీసుకువచ్చిన కూలీలు సైతం పంపడానికి వీలులేకుండా తమ వద్ద ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ తో తాము ఎటూ కదలలేని పరిస్థితి నెలకొందని ఇతర ప్రాంతాల నుంచి పొగాకు పనికి వచ్చిన కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పొగాకు రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రయ విక్రయాలు జరిగేలా చూడాలంటూ రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఇప్పటికే వరుస నష్టాలతో కుదేలవుతున్న పొగాకు రైతులు పూర్తిగా అప్పుల భారంతో మునిగిపోవడం ఖాయమని అంటున్నారు. వెంటనే పొగాకు బోర్డు అధికారుల ద్వారా కొనుగోళ్లు జరిగేలా చూడాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో 97 మండలాలు రెడ్‌జోన్లుగా గుర్తింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.