పశ్చిమగోదావరి జిల్లా దెందూలూరు మండలం గాలాయగూడెంలో విషాదం జరిగింది. మరికొన్ని రోజుల్లో పండంటి పాపాయికి జన్మనివ్వాల్సిన ఓ ఇల్లాలు మృతి చెందింది. గ్రామానికి చెందిన దర్శినపు నాగరాజుకు కృష్ణాజిల్లా జంగన్న గూడెం గ్రామానికి చెందిన మౌనికతో ఏడాది కిందట వివాహమైంది. ప్రస్తుతం మౌనిక తొమ్మిది నెలల గర్భిణి. ఆమె ఈ నెల 5న ఇంట్లోని ఎలుకల మందును పళ్లు తోముకునే పేస్ట్ అనుకుని శుభ్రం చేసుకుంది. రెండు రోజులు బాగానే ఉంది. తర్వాత ఆరోగ్యం క్షీణించటంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా కడుపులోని శిశువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మౌనిక పరిస్థితి విషమించటంతో గుంటూరు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.
ఇవీ చదవండి