మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర పై పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం జోగన్నపాలెంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అహ్మదీయ సంస్థ జిల్లా ఇన్ఛార్జ్ మహమ్మద్ సిరాజ్ హాజరయ్యారు. జిహాద్ అంటే కోరికలను చంపుకోవడమని, కానీ కొందరు దీనిని వక్రీకరించి ఇతరులను చంపడంగా వర్ణించడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ధర్మాలకు సత్సంబంధాలు ఉన్నాయని, అందరూ చెప్పిన సారాంశం ప్రేమతో జీవించడమేనని అన్నారు.
ఇదీచదవండి.