ETV Bharat / state

పురోగమనం దిశగా పౌల్ట్రీ పరిశ్రమ - Poultry industry towards progress in west godavari district

కొవిడ్‌ దెబ్బకు కుదేలైన కోళ్ల పరిశ్రమ ప్రస్తుతం గుడ్డుధర పెరుగుదలతో ఊపిరి పీల్చుకుంటోంది. గత రెండున్నరేళ్లుగా కోళ్ల పెంపకందారులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన కరోనా వైరస్‌ మరింత నష్టాల పాల్జేసింది. గుడ్డు ధర కొన్ని రోజులుగా నిలకడగా పెరుగుతూ రూ.5.29 పైసలకు చేరి రికార్డు స్థాయికి చేరువకావడంతో ఈ రంగంలో కొంతమేర ఆశాజనక వాతావరణం నెలకొన్నప్పటికీ, ప్రభుత్వం సహకారం తోడైతే నష్టాలను భర్తీ చేసుకుంటూ తొందరగా గాడినపడే అవకాశం ఉంటుందని రైతులు చెబుతున్నారు.

పురోగమనం దిశగా పౌల్ట్రీ పరిశ్రమ
పురోగమనం దిశగా పౌల్ట్రీ పరిశ్రమ
author img

By

Published : Oct 8, 2020, 8:43 AM IST

ట్రేలలో కోడి గుడ్లు

పశ్చిమగోదావరి జిల్లాలో 1.30 కోట్లు కోళ్ల పెంపకానికి సరిపడా మౌలిక వసతులతో కూడిన షెడ్లున్నాయి. అయితే మేత ధరల అనూహ్యంగా పెరగడం, గుడ్డు గిట్టుబాటు ధర కంటే తక్కువకే విక్రయించాల్సి రావడంతో నష్టాలను భరించలేక చాలామంది రైతులు కోళ్ల పెంపకానికి దూరమయ్యారు. రెండు లక్షల సామర్థ్యంతో కోళ్లు పెంచే రైతులు సుమారు రూ.5కోట్లు మేర నష్టాలను చవిచూడాల్సి వచ్చిందంటే కోళ్ల పరిశ్రమ దెబ్బతిన్న తీరు అర్థమవుతోంది. ప్రస్తుతం జిల్లాలో 80 లక్షల కోళ్లు ఉన్నాయి. వీటి నుంచి నిత్యం 80 శాతం మేర గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో 70 శాతం వరకు ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి. కొవిడ్‌ ప్రబలుతున్న తరుణంలో షోషకాహారంగా గుడ్డు తినాలన్న వైద్యుల సూచనలతో స్థానిక వినియోగం కూడా ఒక్కసారిగా పెరిగింది. అంతేగాక పాఠశాలలకు సెలవులైనప్పటికీ మధ్యాహ్న భోజన పథకంలో అందించే గుడ్డును విద్యార్థులకు అందించడం వంటి అంశాలు కోళ్ల పెంపకానికి ఊరటనిస్తున్నాయి. దీంతో గుడ్డు ధర అనూహ్యంగా పెరగడానికి కారణంగా ఉంది. కోడి పిల్లలు(చిక్‌) సరఫరా చేసే హేచరీలు కొవిడ్‌ దెబ్బకు 40నుంచి 50శాతం మేర ఉత్పత్తిని తగ్గించాయి. ప్రస్తుతం సరఫరా అంతంతమాత్రంగా ఉంది. అంతేగాక కోళ్ల మేతలో అధికంగా వినియోగించే మొక్కజొన్న టన్ను ధర రూ. 22వేల నుంచి రూ.15,000లకు దిగిరావడంతో మేతకు వెచ్చించే వ్యయాల్లో వెసులుబాటు కలిగింది.

రాయితీలు ఇవ్వాలి

తెలంగాణ ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా ఫౌల్ట్రీరంగానికి మొక్కజొన్న క్వింటాకు రూ.200 వరకు రాయితీ ఇస్తోంది. కోళ్ల పరిశ్రమకు రావాల్సిన వడ్డీ రాయితీ ఇస్తే పౌల్ట్రీకి మనుగడ ఉంటుంది. కోళ్లమేతలో నాణ్యతా ప్రమాణాలు పరీక్షించే ల్యాబ్‌లు ఏర్పాటు చేసి నాణ్యత కలిగిన మేతనే సరఫరా చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. - ఆత్కూరి దొరయ్య, ఆంధ్రప్రదేశ్‌ పౌల్ట్రీ ఫెడరేషన్‌ సంయుక్త కార్యదర్శి

ఇదీచదవండి

భార్యపై భర్త హత్యాయత్నం​.. పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.