ETV Bharat / state

నష్టాల ఊబిలో పౌల్ట్రీ పరిశ్రమ

పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా పౌల్ట్రీ రైతులు ఇబ్బందులకు గురయ్యారు. గడ్డు పరిస్థితులు ఒకదాని వెంట మరొకటి పరిశ్రమలను తరుముతున్నాయి. పరిశ్రమలకు సోకిన వైరస్, ఆ తరువాత కరోనా వైరస్ కారణంగా గుడ్లు మాంసం తినకూడదనే వదంతులు వరుసగా ..వీటిపై ప్రభావం చూపాయి. దీంతో తీవ్రంగా నష్టపోయామని పౌల్ట్రీ రైతులు ఆవేదన చెందుతున్నారు.

author img

By

Published : Jun 4, 2020, 9:07 AM IST

POULTRY
POULTRY

పశ్చిమగోదావరి జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగంగా నాలుగు దశాబ్దాల కిందట ప్రారంభమైన పౌల్ట్రీ పరిశ్రమ అంచెలంచెలుగా ఎదిగి రైతులు ఈ పరిశ్రమలో స్థిరపడేలా చేసింది. వేల సంఖ్యలో కోళ్లతో ప్రారంభమైన పౌల్ట్రీ పరిశ్రమ.. కోటి 30 లక్షల కోళ్ల స్థాయికి ఎదిగింది. గత సంవత్సరం మార్చి నెలలో పరిశ్రమలో వ్యాపించిన వైరస్ ఈ పరిస్థితిని మార్చేసింది. వైరస్ కారణంగా కోడిగుడ్డు, చికెన్ తినకూడదని వదంతుల వల్ల గుడ్డు ధర పడిపోయింది. దీనికి తోడు ముడిసరుకుల ధరలు పెరగకపోయినా.. లాక్‌డౌన్‌ కారణంతో రవాణా చార్జీలు పెంచడంతో రైతులు ఇబ్బందులు పాలయ్యారు.

కరోనా ప్రభావంతో కోడిగుడ్లు మారుమూల ప్రాంతాలకు చేరకపోవడం, గుడ్డు రేటు తగ్గిపోవడం మరో కారణం అయింది. పౌల్ట్రీ పరిశ్రమల్లో ఉపయోగించే అన్ని రకాల ముడి సరుకులకు ప్రభుత్వ మద్దతు ధరలు ఉన్నా.. పౌల్ట్రీ ఉత్పత్తులకు మాత్రం మద్దతు ధర లేదని రైతులు అంటున్నారు. కోడిగుడ్డుకు ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం మూడు రూపాయలు 70 పైసలు పైన మద్దతు ధర ఉంటేనే గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు.

గత ఏడాది కాలంగా పరిశ్రమలో ఎదురైన అడ్డంకులు పరిశ్రమ మనుగడకే సవాలుగా మారింది. మేత రేటు పెరగటం కోళ్లకు రైతులు మేత పెట్టలేని దుస్థితి ఏర్పడింది. మేత పెట్టలేని పరిస్థితుల్లో ఉన్న కోళ్లను అతి తక్కువ ధరలకు అమ్ముకున్నారు. కోళ్ల వైరస్, కరోనా వైరస్ ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లాలో 30 నుంచి 40 లక్షల కోళ్లు తగ్గిపోయాయి. జిల్లా నుంచి రోజుకు 45 లారీల వరకు గుడ్లు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం 30 లారీలు మించి ఎగుమతి కావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: చికెన్ గున్యా వ్యాక్సిన్ అభివృద్ధికి భారత్ బయోటెక్​తో ఒప్పందం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.