పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ఉన్న వలసకుంట చెరువులో పురపాలక సిబ్బంది వ్యర్థాలను వేస్తున్నారు. ఫలితంగా కుంచినపల్లి గ్రామస్థులు పురపాలక సిబ్బందిని అడ్డుకున్నారు. చెత్తను చెరువులో వేస్తున్నందునా నీరు కలుషితం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్వాసన వల్ల అంతుచిక్కని రోగాలు వచ్చి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని వాపోయారు. దోమలు విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు. అధికారులు స్పందించి, చెరువులో చెత్త వెయ్యకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: వింతవ్యాధి బాధితులను పరామర్శించిన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్