ETV Bharat / state

రిగ్గింగ్ జరుగుతోందని ఓ వర్గం ఆందోళన.. కాసేపు నిలిచిన పోలింగ్

author img

By

Published : Feb 21, 2021, 5:09 PM IST

పోలింగ్ అధికారులు రిగ్గింగ్​కు పాల్పడుతున్నారంటూ.. పశ్చిమ గోదావరి జిల్లా గుణపర్రులో ఓ వర్గం వారు ఆందోళనకు దిగారు. దీంతో కొంతసేపు పోలింగ్ నిలిపివేశారు. పోలీసులు, సబ్ కలెక్టర్ జోక్యంతో వివాదం సద్దుమణగటంతో.. పోలింగ్ పునఃప్రారంభించారు.

రిగ్గింగ్ జరగుతోందని ఓ వర్గం ఆందోళన.. కొంత సమయం నిలిచిన పోలింగ్

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం గుణపర్రులో పోలింగ్ సమయంలో వివాదాం తలెత్తింది. వైకాపా, వైకాపా రెబల్ అభ్యర్థుల మధ్య వివాదం చెలరేగింది. పోలింగ్ అధికారులు రిగ్గింగ్​కు పాల్పడ్డారంటూ ఓ వర్గం వారు ఆరోపిస్తూ.. పోలింగ్ కేంద్రం ముందే ఆందోళనకు దిగారు. దీంతో కొంతసేపు పోలింగ్ నిలిచిపోయింది. నరసాపురం సబ్​కలెక్టర్ విశ్వనాథన్ గుణపర్రుకు చేరుకొని.. అధికారులతో మాట్లాడారు. ఇరు వర్గాలను సముదాయించి.. పోలింగ్​ను పునః ప్రారంభించారు.

వివాదం చెలరేగింది ఇలా..

ఓ వృద్ధురాలు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి రాగా.. బ్యాలెట్ పేపర్లను పోలింగ్ సిబ్బంది అందించారు. ఆమె ఓటు వేసేందుకు ఇబ్బంది పడుతుండగా.. అక్కడే ఉన్న పోలింగ్ అధికారి, పోలింగ్ ఏజెంట్ల అనుమతితోనే ఆమె దగ్గరకు వెళ్లారు. అప్పటికే ఆమె ఓటు వేసేసిందని.. పోలింగ్ అధికారి చెప్తుండగా, వృద్ధురాలు మాత్రం ఆ అధికారి తాను చెప్పిన గుర్తుకు కాకుండా మరో గుర్తుకు ఓటు వేసేశారని ఆరోపిస్తూ.. గట్టిగా అరిచింది. దీంతో బయటే ఉన్న ఓ వర్గం వారు వచ్చి ఆమె దగ్గర ఉన్న బ్యాలెట్ పేపర్లు తీసుకొని, ఆ అధికారిపై దాడికి చేశారు. వృద్ధురాలి బ్యాలెట్ పేపర్లను సైతం పోలింగ్ కేంద్రం బయటకు తీసుకువెళ్లిపోయారు. ఘర్షణ మరింత పెద్దది కావటంతో.. అధికారులు కొంతసేపు పోలింగ్​ నిలిపివేశారు.

ఇదీ చదవండి: పల్లె పోరు: మధ్యాహ్నం 12.30 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.