పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడులో తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. పంగిడిగూడేనికి చెందిన గుమ్మడి దేవయ్య తెలంగాణ నుంచి 47 మద్యం సీసాలు ద్విచక్రవాహనంపై తీసుకొస్తూ పట్టుబడ్డాడు. ప్రభుత్వం మద్యం షాపులో పనిచేస్తున్న మీసాల వెంకన్నబాబు, జిలకరగూడేనికి చెందిన సబ్బన గోపికృష్ణతో కలిసి .. తెలంగాణ నుంచి మద్యం తెచ్చి ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఈ ఘటనలో ఎస్ఐడీ. వెంకటేశ్వరరావు ముగ్గురిని అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి 51 మద్యం సీసాలు , ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి. తలనీలాల సమర్పణకు వెళ్తే.. తప్పని తిప్పలు