పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం తనిఖీ కేంద్రం వద్ద అక్రమంగా తరలిస్తున్న 79 బస్తాల ఎరువులను పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ఆ బస్తాలను వ్యవసాయ అధికారులకు అప్పగించారు. వీటిని జంగారెడ్డిగూడెం నుంచి తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎరువులను కామయ్యపాలెం డీసీఎంఎస్ దుకాణంలో భద్ర పరిచామని మండల వ్యవసాయ అధికారి పార్వతి తెలిపారు. ఎరువుల తరలింపులో ఈపాస్ బిల్లులు తప్పనిసరిగా ఉండాలని ఏవో చెప్పారు. రైతుల పేరిట ఎరువులను అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.
ఇదీ చదవండీ...కారును ఢీకొట్టిన ఆటో.. ముగ్గురికి గాయాలు