ఒకపక్క కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచమంతా గడగడలాడుతుంటే అదేమీ పట్టనట్లు కొందరు జూదగాళ్లు పేకాటలతో, కోడి పందాలతో విందు వినోదాల్లో మునిగి తేలారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గాయత్రి గుడి సెంటర్లో కోడి పందేలు ఆడుతున్నారన్న సమాచారం మేరకు పలువురు కానిస్టేబుళ్ళు సంఘటనా స్థలానికి వెళ్లారు. అదేమని ప్రశ్నంచగా పోలీసులపై ఎదురు దాడి చేసే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ సంఘటనా స్థలానికి వెళ్లి లాఠీ దెబ్బలు తినిపించారు. వాళ్ల దగ్గర నుంచి ఓ కోడిని, 600 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించిన వారు శిక్షార్హులని పట్టణ సీఐ ఆకుల రఘు హెచ్చరించారు.
ఇదీ చూడండి: