పోలవరం ఎడమ కాల్వ అనుసంధానం, సొరంగం పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ప్రారంభించిన అధికారులు...టెక్నికల్ బిడ్లను తెరిచారు. ఇనిషియల్ బెంచ్ విలువ రూ.274.55 కోట్లు కాగా... మాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ 15.6 శాతం తక్కువగా కోట్ చేసింది.
రివర్స్ టెండర్‌తో పోలవరం 65వ ప్యాకేజీ పనిలో రూ.58.53 కోట్లు మిగులు సాధించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో రూ.276 కోట్ల విలువైన పనిని.. 4.77 శాతం అధిక ధర రూ.290 కోట్లకు మాక్స్ ఇన్‌ఫ్రాకు ఇచ్చారని వెల్లడించారు. ఇదే పనికి రివర్స్ టెండర్ ప్రక్రియ నిర్వహించగా.. 15.6 శాతం తక్కువగా రూ.231 కోట్లకు పని చేస్తామంటూ మాక్స్ ఇన్‌ఫ్రా కంపెనీ ముందుకొచ్చింది. మొత్తంగా పోలవరం 65వ ప్యాకేజీ పనిలో ప్రభుత్వానికి రూ.58.53 కోట్లు మిగిలాయి. రివర్స్ టెండరు ప్రక్రియలో ఆరు కంపెనీలు పాల్గొన్నాయని అధికారులు తెలిపారు.
శుభ పరిణామం
జలవనరుల శాఖలో ఇది శుభపరిణామం అని ఆ శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. రివర్స్ టెండరింగ్ వల్ల 15.6 శాతం తక్కువతో రూ.50 కోట్లు ఆదా అయినట్లు వివరించారు. వచ్చే ఏడాదిలోగా పోలవరం నిర్వాసితులకు 25 వేల ఇళ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు. ఈనెల 23న ప్రాజెక్టు హెడ్ వర్క్స్, స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించిన టెక్నికల్ బిడ్లను అధికారులు తెరవనున్నారు.
ఇదీ చూడండి : 'రాష్ట్రంలో 3 మేజర్ పోర్టుల నిర్మాణానికి యత్నం'