ముఖ్యమంత్రి జగన్ స్వయంగా జోక్యం చేసుకుంటే తప్ప పోలవరం నిధుల సమస్య పరిష్కారం కాదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సొంత పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించారు. నిధుల విడుదలలో కేంద్రం తీరుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తెలపాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ తనపై ఉన్న కేసుల కోసం రాజీపడ్డారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని ఎంపీ చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల విషయంలో అయోమయం నెలకొంది. తప్పు ఎవరిదని కోస్తాంధ్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రధాని మోదీ తొలి కేబినెట్ సమావేశంలో పోలవరం అథారిటీ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను అథారిటీకి అప్పగించారు. అయితే కేంద్ర సాయం లేనిదే రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదా అని గతంలో జగన్ ప్రశ్నించారు. అదే ప్రశ్నను రాష్ట్ర ప్రజలు ఇప్పుడు మా పార్టీని ప్రశ్నిస్తున్నారు. కొంత ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించి ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయాలి. - రఘురామకృష్ణరాజు, నరసాపురం ఎంపీ
ఇదీ చదవండి: