తెలంగాణలోని భద్రాచలం వద్ద 42 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకున్న పరిస్థితుల్లో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం పరిసర ప్రాంతాల్లో ప్రవాహం పెరిగింది. పోలవరంలో గోదావరి నీటిమట్టం 23 మీటర్లకు చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ వద్ద ప్రవాహం ఎక్కువగా ఉంది. గ్రావిటీ ద్వారా ప్రవాహం స్పిల్ ఛానెల్‌కు చేరుకుంటోంది. వరదనీటిలో కొత్తూరు కాజ్వే మునిగిపోయింది. సుమారు 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో లోతట్టు ప్రాంతాలు ముంపు ముప్పుతో గజగజలాడుతున్నాయి. మరో రెండు రోజులు వరద ప్రవాహం కొనసాగుతుందని అధికారులు చెప్పారు. ప్రజలను అప్రమత్తం చేశారు.
ఇది కూడా చదవండి