ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతి చెందిన వ్యక్తి చిన్నం నందగోపాల్ (40)గా స్థానికులు గుర్తించారు.
నందగోపాల్, బుజ్జమ్మ దంపతులు. ఇద్దరూ తరచూ గొడవ పడేవారు. భర్తను వదిలేసిన బుజ్జమ్మ హైదరాబాద్ వెళ్లిపోయింది. ఈ క్రమంలో నందగోపాల్ తాను నివాసం ఉంటున్న ఇంటిలో ఆదివారం చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడుని తెలుస్తోంది. వీఆర్వో రమేష్ బాబు ఫిర్యాదుతో చేబ్రోలు ఎస్సై వీర్రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: