పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం కోడేరు శివారు గ్రామం కోడేరు లంక. అక్కడ రెండు వార్డుల్లో సుమారు 500 మంది జనాభా ఉంటారు. మూడు వందల మంది ఓటర్లున్నారు. గోదావరి చెంతనే ఉన్న ఈ ప్రాంతం ప్రజలు ఓటు వేయాలంటే నదిని దాటుకుని కోడేరు గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంవత్సరాల తరబడి మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవట్లేదంటూ లంక ప్రజలు వాపోతున్నారు. దీంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: పల్లెపోరు: ఎవరు ఎంత ఖర్చుపెట్టాలి..? లెక్కల సంగతేంటి..?