ETV Bharat / state

Pawan Kalyan fire on CM Jagan: వాలంటీర్ వ్యవస్థలో కిరాతకులు ఉన్నారు.. ఎవరిది బాధ్యత..: పవన్‌ - వాలంటీర్​ వ్యవస్థపై పవన్​ ఆగ్రహం

Pawan Kalyan fire on CM Jagan: మరోసారి వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్​కల్యాణ్​ విరుచుకుపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థలో కిరాతకులున్నారన్నారు. దీనికి బాధ్యత ఎవరిది అని పవన్​ ప్రశ్నించారు. జగన్​కు అసలు వాలంటీర్​ వ్యవస్థ అంటేనే తెలియదన్నారు. వాలంటీర్లు ప్రజలను వేధిస్తున్నారని.. ఆడపిల్లలు లొంగకపోతే పథకాలు తొలగిస్తామని బెదిరించి... అరాచకాలకు పాల్పడుతున్నారని పవన్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

pawan kalyan
pawan kalyan
author img

By

Published : Jul 12, 2023, 7:51 PM IST

Updated : Jul 12, 2023, 8:44 PM IST

Pawan Kalyan in Tadepallygudem Meeting: తాను జనవాణి ప్రారంభించేందుకు వాలంటీర్లే కారణమని జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ స్పష్టం చేశారు. వారాహి యాత్రలో భాగంగా తాడేపల్లిగూడేంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మరోసారి వాలంటీర్​ వ్యవస్థపై పవన్​కల్యాణ్​ విరుచుకుపడ్డారు. రెడ్‌ క్రాస్‌కు దేశంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్‌ హెడ్‌గా ఉంటారు... ఇక్కడ వాలంటీరు వ్యవస్థకు ఎవరు అధిపతి అని ప్రశ్నించారు. వాలంటీర్లు అనేక చోట్ల ప్రజలను వేధిస్తున్నారన్నారు.. తిరుపతిలో ఎర్రచందనం రవాణాలో వాలంటీర్లు పట్టుబడ్డారన్నారు. నేరం చేసిన వాలంటీర్లకు భయం లేదని.. మా జగనన్న నేరం చేసి జైల్లోకి వెళ్లి వచ్చేశాడు.. మేం కూడా జైలుకెళ్లొచ్చి నాయకులవుతామనే ధీమాతో ఉన్నారని పవన్​ స్పష్టం చేశారు.

భూమ్‌ భూమ్‌కి తక్కువ.. ఆంధ్రా గోల్డ్‌కి ఎక్కువ.. వాలంటీరు వేతనం రోజుకు రూ.164.38 అంటే ఉపాధి హామీ కూలీ వేతనం కంటే తక్కువే అని పపవన్​ అన్నారు. వాలంటీరు జీతం భూమ్‌ భూమ్‌కి తక్కువ.. ఆంధ్రా గోల్డ్‌కి ఎక్కువగా ఉందన్నారు. మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌.. ఇప్పటి వరకు రూ.1.35లక్షల కోట్ల మద్యం అమ్మారన్నారు. ఆడబిడ్డల తాళిబొట్లు తెగిపోతే జగన్‌ ముఖంలో నవ్వు వస్తుందిని.. ఆడబిడ్డల మానప్రాణాల సంరక్షణే జనసేన విధానం అని తెలిపారు. మహిళలు కోరుకున్న చోట మద్య నిషేధం అమలు చేస్తామని.. మద్యం వల్ల మహిళలకు ఇబ్బంది ఉండదని పవన్​ హామీ ఇచ్చారు.

వాలంటీర్ వ్యవస్థలో కిరాతకులు ఉన్నారు.. ఎవరిది బాధ్యత..: పవన్‌

‘‘ప్రమాణస్వీకారం రోజు జగన్‌ నన్ను ఆహ్వానించారు. ప్రత్యర్థులుగా ఉన్నందున రాలేనని ఆరోజు చెప్పా. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటానని చెప్పా. జగన్‌ను వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ విమర్శించలేదు. మేం ఎప్పుడూ సీఎం జగన్‌ సతీమణిని వివాదాల్లోకి లాగలేదు. కానీ, జగన్‌ నీకు సంస్కారం లేదు. సీఎంగా ఉండే అర్హత లేదు. వాలంటీరు అంటే జీతం ఆశించకుండా పనిచేసే వ్యక్తి. వాలంటీర్ల కేంద్రం హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ డేటా మొత్తం నానక్‌రామ్‌గూడలోనే ఉంది. నానక్‌రామ్‌గూడలోని ఓ ఏజెన్సీకి ఏపీ ప్రజల సమాచారం ఎందుకు ఇచ్చారో జగన్‌ సమాధానం చెప్పాలి. అందులో పనిచేస్తున్న 700 మందికి ఎవరు జీతాలు ఇస్తున్నారు? వాలంటీర్లపై నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు. వ్యవస్థ పనితీరు గురించే మాట్లాడుతున్నా. ఎర్రచందనం రవాణాలో, మద్యం అక్రమ రవాణాలో, దోపిడీ ఘటనల్లో కొందరు వాలంటీర్లు పట్టుబడ్డారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆడపిల్లలు లొంగకపోతే పథకాలు తొలగిస్తామని భయపెడుతున్నారు". -పవన్​కల్యాణ్​

విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే.. తల్లి, చెల్లిపైనే గౌరవం లేని వ్యక్తి.. జగన్‌ అని పవన్​ అన్నారు. తాను ముష్కరులు, నేరగాళ్లతో పోరాడుతున్నానని చెప్పారు. సొంత బాబాయిపైనే గొడ్డలి వేటు వేసిన వ్యక్తులు వీళ్లు అని అన్నారు. స్థిరమైన ప్రభుత్వం ఇవ్వాలనేదే తన ఉద్దేశమన్నారు. నా భార్యను ఎవరితోనో తిట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదని.. విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో జగన్​ చూపిస్తానని స్పష్టం చేశారు. జగన్ చేసే పనులన్నీ చాలా నీచంగా ఉన్నాయని.. నోటిని అదుపులో పెట్టుకోవాలని జగన్‌కు సూచించాలని భారతిని కోరారు. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే గెలుపు ఉంటుందని.. వచ్చే ఎన్నికల తర్వాత మన ప్రభుత్వమే వస్తుందని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు.

Last Updated : Jul 12, 2023, 8:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.