గోదావరిజలాలు వినియోగించి కృష్ణా డెల్టా ఆయకట్టులో సాగునీటి కష్టాలు తీర్చడం లక్ష్యంగా రూపుదిద్దుకున్న పట్టిసీమ ఎత్తిపోతల పథకం...పనులు ప్రారంభమై ఐదేళ్లు పూర్తయింది. 2015లో ఈ పథకం ప్రారంభంకాగా.. ప్రస్తుతం ఐదో సీజన్లో భారీగా గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు. ఈ నీటితో సమృద్ధిగా పంటలు పండుతున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం ద్వారా కొన్ని వందల టీఎంసీల నీటిని ఎత్తిపోసి...లక్షల ఎకరాలకు నీరందిస్తున్నారు. లక్షలాది మంది ప్రజల తాగునీటి అవసరాలు సైతం తీరుస్తున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల గోదావరి జలాల సద్వినియోగంపై ఈటీవీ భారత్ ప్రతినిధి కథనం.
ఇదీ చూడండి: జాగిలాల విశ్వాసం...యజమాని ఆచూకీ లభ్యం