ETV Bharat / state

భారీ వర్షాలకు మునిగిన వరి పంట.. ఆందోళనలో రైతులు - పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో భారీ వర్షం

వాయుగుండం ప్రభావంతో 24 గంటలుగా ఎడ తెరపిలేకుండా కురుస్తున్న వర్షానికి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, ఉండ్రాజవరం మండల పరిసర ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. వివిధ చోట్ల వరి పాక్షికంగా నేల వాలింది.

భారీ వర్షాలకు మునిగిన వరి పంట.. ఆందోళనలో రైతులు

author img

By

Published : Oct 14, 2020, 2:39 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో అధిక శాతం వరి పండిస్తారు. మెట్ట భూముల్లో అరటి పండిస్తారు. వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షం వల్ల వరి నేల వాలటంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు.

  • ఇప్పటికే మూడు సార్లు..

ప్రస్తుత ఖరీఫ్ కాలంలో ఇప్పటికే మూడు సార్లు పంట వర్షాల బారిన పడటంతో తాజా వర్షాలతో భారీగా నష్టాలను చవి చూడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. నాట్లు వేసే సమయంలో కురిసిన వర్షాలకు నష్టపోవడంతో పాటు పంటకాలంలో చీడపీడలు పెరగడంతో అధిక పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుత వర్షాలకు నేల వాలిన పంటను తిరిగి పునరుద్ధరించేందుకు అదనపు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని రైతులు వాపోయారు.

  • అరటితోట తంటాలు..

ముఖ్యంగా అరటి తోటలో రెండు అడుగుల మేర నీరు నిలిచి ఉంది. తోటలో ఎక్కువ రోజులు నీటి నిల్వ ఉంటే కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇవీ చూడండి :

అల్పపీడనంగా కొనసాగుతున్న తీవ్రవాయుగుండం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.