ద్వారకాతిరుమలలో భక్తుల పాదయాత్ర - dwaraka tirumala
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల వెంకటేశ్వరుని ఆలయానికి భక్తులు పాదయాత్రగా చేరుకున్నారు. భీష్మ ఏకాదశి సందర్భంగా సుమారు పదివేల మంది భక్తులు తరలివచ్చారు.
పాదయాత్ర
Intro:పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల చిన్న వెంకన్న క్షేత్రానికి భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని హిందూ ధర్మ ప్రచార సమితి వ్యవస్థాపకులు అర్జుల మురళీకృష్ణ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల నుంచి పదివేల మంది భక్తులు శనివారం పాదయాత్రగా తరలివచ్చారు. జంగారెడ్డిగూడెం శిరిడి సాయిబాబా ఆలయం వద్ద నుంచి ఉదయం 5 గంటలకు పాదయాత్ర గా బయలుదేరారు. కామవరపుకోట ,టి.నర్సాపురం, బుట్టాయిగూడెం , కొయ్యలగూడెం మండలాల నుంచి భక్తులు పాదయాత్రలో పాల్గొన్నారు .మార్గంమధ్యలో భక్తులకు దాతల సహకారంతో అల్పాహారాన్ని ,మంచినీరు, తేనీరు అందజేశారు. ఈ సందర్భంగా వెంకన్న ఆలయానికి చేరుకున్న భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనానంతరం భక్తులు స్వామివారి అన్నదానంలో అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులు వేలాదిగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి .17 సంవత్సరాల క్రితం మొదట 27 మంది తో ప్రారంభమైన ఈ పాదయాత్ర ప్రస్తుతం 10 వేల మంది భక్తుల తో ముందుకు సాగుతుందని హిందూ ధర్మ ప్రచారకులు తెలిపారు.
Body:వృద్ధులను, చంటి బిడ్డ తల్లులను ప్రత్యేక క్యూ ల ద్వారా దర్శనానికి అనుమతించారు.
Conclusion:భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.
Body:వృద్ధులను, చంటి బిడ్డ తల్లులను ప్రత్యేక క్యూ ల ద్వారా దర్శనానికి అనుమతించారు.
Conclusion:భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.