పశ్చిమగోదావరి జిల్లా సీతారాంపురం వద్ద ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ లీకై.. స్వల్పంగా మంటలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారిగా గ్యాస్ పైప్లైన్ లీకేజీతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే.. గ్యాస్ నిల్వల స్థితిని తెలుసుకునేందుకే పైప్లైన్ లీక్ చేశామని ఓఎన్జీసీ సిబ్బంది తెలిపారు.
సామర్ధ్య పరీక్షలు నిర్వహించాం..
సీతారాంపురం వద్ద సామర్ధ్య పరీక్షలే నిర్వహించామని ఓఎన్జీసీ వర్గాలు వెల్లడించాయి. డ్రిల్లింగ్ వల్ల ఎగిసిపడుతున్న మంటల వల్ల ఎటువంటి ప్రమాదం లేదని పేర్కొన్నాయి.
ఇదీ చదవండీ.. కృష్ణా నదిలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా