ETV Bharat / state

పశ్చిమాన "స్థానిక" సందడి... అధికారులు బిజీబిజీ! - wast godavari

పశ్చిమగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి అప్పుడే మొదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారుల కసరత్తు
author img

By

Published : Jul 31, 2019, 4:26 PM IST

స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారుల కసరత్తు

పశ్చిమగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ఉన్న 48 మండలాల్లో 920 ఎంపీటీసీ స్థానాలకు, 48 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా... జిల్లా పరిషత్ సీఈవో నేతృత్వంలో దశలో వారిగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ పక్క పాలనా వ్యవస్థ కుంటు పడకుండా... వివిధ శాఖల అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. మరో వైపు అక్టోబర్​లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నందున... జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఓటర్ల జాబితా సిద్ధం చేయడంతోపాటు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, తదితర అంశాలపై పనులు ప్రారంభం చేశారు. ఈ నేపథ్యంలో సిబ్బంది తుది నివేదికను సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 909 పంచాయతీల్లో 2794 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా... సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు చెబుతున్నారు. దీనిపై అధ్యయనం చేసి ఎన్నికల సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతూ.. పటిష్టమైన భద్రత నడుమ ఎన్నికలు నిర్వహించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

ఇదీ చూడండి... బెలూన్​ ఎక్కి గాలిలో విహరిద్దాం రండి..!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.