ETV Bharat / state

'కొల్లేరు'పై బడాబాబుల కన్ను.. యథేచ్ఛగా చేపల చెరువులు!

author img

By

Published : Mar 31, 2022, 8:36 PM IST

కొల్లేరు అభయారణ్యంలో ఆక్రమణల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. స్వార్థ ప్రయోజనాల కోసం.. బడాబాబులు వందల ఎకరాల కొల్లేరును.. చేపల చెరువులుగా మార్చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు కూతవేటు దూరంలో వందల ఎకరాల్లో కొల్లేరు దురాక్రమణ సాగుతున్నా.. అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

'కొల్లేరు'పై బడాబాబుల కన్ను
'కొల్లేరు'పై బడాబాబుల కన్ను
'కొల్లేరు'పై బడాబాబుల కన్ను.. యథేచ్ఛగా చేపల చెరువులు !

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు గ్రామీణ మండలం పెదయాగనమిల్లి సమీపంలో కొల్లేరు ఆక్రమణకు గురవుతోంది. కొల్లేరు అభయారణ్యంలోకి తవ్వే యంత్రాలు ప్రవేశించటం చట్టరీత్యా నేరం. యంత్రాలను కొల్లేరులోకి తీసుకెళ్లాలంటే.. అనుమతులు తప్పనిసరి. అలాంటిది ఐదో కాంటూరు వద్ద.. భారీ యంత్రాలతో అభయారణ్యాన్ని చేపల చెరువులుగా మారుస్తున్నా.. అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ కనుసన్నల్లోనే కొల్లేరులో తవ్వకాలు సాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దెందలూరు నియోజకవర్గానికి చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధి తవ్వకాల్లో ప్రత్యక్ష పాత్ర పోషిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

పెదయాగనమిల్లి వద్ద కొల్లేరు అభయారణ్యం ఉంటుంది. గతంలో ఇక్కడ ఉన్న చేపల చెరువులు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో ధ్వంసం చేశారు. పక్షులకు ఆవాసం కల్పించడం, కొల్లేరు పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ఐదో కాంటూరు వరకు అభయారణ్యంగా ప్రకటించారు. ఇందులో ఎలాంటి చేపల చెరువులూ తవ్వడానికి వీల్లేదు. కానీ వైకాపా అధికారంలోకి వచ్చాక కొల్లేరులో పరిస్థితులు మారాయి. ఐదు, మూడో కాంటూరు లోపలికి వెళ్లి.. చేపల చెరువుల కోసం కొల్లేరును ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. గుడివాకలంక, పత్తికోళ్లలంక గ్రామాల పరిధిలో ఇప్పటికే కొల్లేరును ఆక్రమించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. పోలీసులు నామమాత్రంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప తవ్వకాలకు అడ్డుకట్ట పడటం లేదని కొల్లేరు పరిరక్షణ సమితి సభ్యులు అంటున్నారు. ఇకనైనా కొల్లేరు అభయారణ్యంలో ఆక్రమణలు నియంత్రించి.. కొల్లేరు సరస్సుకు పూర్వవైభవం తీసుకురావాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

"కొల్లేరు సరస్సును చేపల చెరువుగా చేయడం వల్ల అక్కడ జీవిస్తున్న అనేక మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ల జీవనోపాధిని కోల్పోతున్నారు. ప్రజా ప్రతినిధులే ఆక్రమణలకు పాల్పడుతున్నారు. అధికారులు లంచాలకు ఆశపడి చేపల చెరువులకు అవకాశం ఇస్తున్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు." - వెంకటేశ్వరరావు, కొల్లేరు పరిరక్షణ సమితి సభ్యుడు

ఇదీ చదవండి: Chikki with CM photo: చిక్కీలపై సీఎం బొమ్మ...ప్రభుత్వంపై అధిక భారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.