పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు భీమడోలులో ప్రయాణికుల కోసం ఆగింది. ఈ క్రమంలో వెనుక నుంచి వస్తున్న ఇన్నోవా కారు ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరికి తీవ్రగాయాలు, ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.